Pawan Kalyan: వారి స‌ల‌హాలు రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవ‌స‌రం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Deputy CM Pawan Kalyan Spoke on the Topic of reducing Environmental Pollution
  • విజ‌య‌వాడ‌లో ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యాన్ని త‌గ్గించే అంశంపై స‌ద‌స్సు
  • కాలుష్య నివార‌ణ‌కు ప్ర‌ణాళిక‌లు అవ‌స‌ర‌మ‌న్న‌ జ‌న‌సేనాని
  • నిపుణులు, అనుభ‌వ‌జ్ఞుల స‌ల‌హాలు రాష్ట్రాభివృద్ధికి అవ‌స‌రమ‌ని వ్యాఖ్య‌
ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యాన్ని త‌గ్గించే అంశంపై విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన సద‌స్సులో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్ మాట్లాడారు. "నిపుణులు, అనుభ‌వ‌జ్ఞుల స‌ల‌హాలు రాష్ట్రాభివృద్ధికి అవ‌స‌రం. మేం చెప్ప‌డానికి కాదు, వినేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. రోజురోజుకీ కాలుష్యం పెరుగుతోంది. ఒక్కోసారి భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందా అని భ‌య‌మేస్తోంది" అని ప‌వ‌న్ అన్నారు. 

కాలుష్య నివార‌ణ‌కు ప్ర‌ణాళిక‌లు అవ‌స‌ర‌మ‌ని పవన్ తెలిపారు. ఈ విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు అంద‌రి స‌ల‌హాలు, సూచ‌న‌లు అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. స‌రైన నిర్ణ‌యంతోనే మంచి ఫ‌లితాలు సాధ్య‌మ‌ని పవన్ పేర్కొన్నారు​​​​​.
Pawan Kalyan
Environmental Pollution
Vijayawada

More Telugu News