Tamannaah Bhatia: మల్లన్న క్షేత్రంలో నాగసాధుగా తమన్నా లుక్‌ చూశారా?

Have you seen Tamannaahs look as Nagasadhu in Mallanna Kshetra
  • ఓదెల 2లో నాగసాధుగా కనిపించనున్న తమన్నా 
  • కెరీర్‌లో తొలిసారిగా ఈ పాత్రలో కనిపించనున్న తమన్నా 
  • ఓదెల మల్లన్న ఆలయంలో చిత్రీకరణ చేస్తున్న చిత్రయూనిట్‌
తమన్నా భాటియా ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం 'ఓదెల-2'. ఇప్పటి వరకూ పోషించని విభిన్నమైన పాత్రలో ఆమె ఈ చిత్రంలో కనిపించబోతుంది. కెరీర్‌లో తొలిసారిగా తమన్నా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2021లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్‌'కి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీకి అశోక్ తేజ దర్శకుడు. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన తమన్నా ఫస్టలుక్‌ మంచి బజ్‌ను క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణలో భాగంగా చివరి షెడ్యూల్ ఓదెల విలేజ్ లో జరుగుతోంది. మహాదేవుని ఆశీస్సులతో కాశీలో ప్రారంభమైన ఈ థ్రిల్లింగ్ సీక్వెల్ ఇప్పుడు ఓదెల మల్లన్న క్షేత్రంలో చిత్రీకరణ జరుగుతోందని, టీం ఐకానిక్ ఓదెల మల్లన్న ఆలయం, గ్రామంలోని అందమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలను షూటింగ్‌ చేస్తున్నామని చిత్ర యూనిట్‌ తెలిపింది. తమన్నా, మురళీ శర్మ, హెబ్బా పటేల్, యువ, ఇతర నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. 

Tamannaah Bhatia
Odela2
Sampath nandi
Tamannaah new look
Tollywood
Tamannaah new film

More Telugu News