Nara Lokesh: రేపు ఒక భారీ ప్రకటన రానుంది... సిద్ధంగా ఉండండి: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh says a big announcement will be revealed tomorrow
  • మంత్రి లోకేశ్ తో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ
  • సోషల్ మీడియాలో స్పందించిన లోకేశ్
  • ఈ సమావేశం అద్భుతంగా జరిగిందని వెల్లడి 
ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ టాటా సన్స్ సంస్థ బోర్డు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తో అద్భుతమైన సమావేశం జరిగిందని వెల్లడించారు. దీనికి సంబంధించి రేపు ఒక భారీ ప్రకటన వెలువడనుంది... సిద్ధంగా ఉండండి అంటూ లోకేశ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

ఈ మేరకు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తో కలిసున్న ఫొటోను కూడా పంచుకున్నారు. లోకేశ్ ట్వీట్ చూస్తుంటే... రాష్ట్రానికి ఒక భారీ పరిశ్రమ వచ్చే అవకాశాలున్నట్టు అర్థమవుతోంది.
Nara Lokesh
Big Announcement
Tata Sons
Natarajan Chandrasekaran
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News