TTD: శ్రీవారికి ఉపయోగించేందుకు చెన్నై నుంచి తిరుమల చేరుకున్న గొడుగులు

the umbrellas arrived in tirumala from chennai which will be decorated during the garuda vahana seva
  • టీటీడీకి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను అందజేసిన చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్
  • సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించనున్న గొడుగులు
  • గొడుగులను మాడ వీధుల్లో ఊరేగించి ఆలయంలోకి తోడ్కొని వెళ్లిన టీటీడీ అధికారులు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ నాడు స్వామి వారికి అలంకరించేందుకు గానూ తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను చెన్నై నుంచి హిందూ ధర్మార్థ సమితి సోమవారం తీసుకువచ్చింది. సమితి ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్ ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న వీటికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. 

చెన్నై నుంచి తీసుకొని వచ్చిన ఈ గొడుగులను ఆలయం ముందు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి ట్రస్టీ ఆర్ ఆర్ గోపాల్ నేతృత్వంలో అందజేశారు. టీటీడీ అధికారులు గొడుగులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన తర్వాత ఆలయంలోకి తీసుకువెళ్లారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే శ్రీవారి గరుడ సేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.  
.
TTD
Tirumala
Garuda Vahana Seva
Brahmanandam

More Telugu News