Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.... ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి

Four people of same family dies in road accident in Sanga Reddy district
  • పొలానికి బైక్ పై వెళ్లి తిరిగొస్తుండగా ఘటన
  • బైక్ ను ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసీ బస్సు
  • మృతుల స్వగ్రామంలో తీవ్ర విషాదం
తెలంగాణలోని సంగారెడ్డి  జిల్లా గణేశ్ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఓ బైక్ ను ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మృతి చెందిన నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులను సిద్ధరామప్ప (71), జగన్నాథ్ (41), రేణుక (36), వినయ్ (15)గా గుర్తించారు. 

వీరంతా పొలానికి బైక్ పై వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడంతో, వారి స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Road Accident
Four People
Death
Sangareddy District

More Telugu News