Nithiin: సక్సెస్‌లు ఇచ్చిన దర్శకులతోనే నితిన్‌ సినిమాలు

Nithiin Chooses to Work Only with Directors Who Delivered Hits
  • విక్రమ్‌కుమార్‌తో మరో సినిమా చేయడానికి నితిన్‌ గ్రీన్‌సిగ్నల్‌ 
  • ఇప్పటి వరకు చేయని ఓ డిఫరెంట్‌ జోనర్‌లో తాజా సినిమా 
  • నితిన్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ చిత్రమిది
హీరో నితిన్‌ గత కొంతకాలంగా సరైన విజయం లేక సతమతమవుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్‌ చిత్రాలుగా నిలిచాయి. 2020లో భీష్మ తరువాత ఆయనకు ఇప్పటి వరకు సరైన విజయం దక్కలేదు. అందుకే ఇక గతంలో తనకు విజయాలు అందించిన దర్శకులతోనే పనిచేయాలని నితిన్ నిర్ణయించుకున్నాడు. 

ప్రస్తుతం ఇంతకు ముందు ఆయనకు భీష్మ లాంటి సక్సెస్‌ను ఇచ్చిన వెంకీ కుడుములతో రాబిన్‌హుడ్‌ అనే చిత్రంలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న నాయిక. దీంతో పాటు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో 'తమ్ముడు' చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా వుండగా నితిన్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. 

తన రెండో ఇన్నింగ్స్‌కు ఇష్క్‌ అనే మరుపురాని బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని అందించిన విక్రమ్‌కుమార్‌తో ఈ కథానాయకుడు మరోసారి జత కట్టనున్నాడు. ఇటీవల హనుమాన్‌తో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్న ప్రైమ్‌ షో సంస్థ అధినేత నిరంజన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్న ఈ చిత్రాన్ని నితిన్‌ కెరీర్‌లో అత్యధిక బడ్డెట్‌తో నిర్మించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు నితిన్‌ చేయని ఓ డిఫరెంట్‌ జోనర్‌లో ఈ సినిమా వుండబోతుందని సమాచారం.
Nithiin
Nithiin latest films
Vikram k kumar
Robin hood
Tammudu
Tollywood
Ishq

More Telugu News