UK Robber: ఒంటరి మహిళ ఇంట్లోకి చొరబడి ఇంటి పనులన్నీ చేసిన వింత దొంగ

UK Robber Breaks Into Home Cooks Meal For Victim And Hangs Clothes To Dry
  • వెళుతూ వెళుతూ సంతోషంగా జీవించు అంటూ లేఖ రాసిపెట్టిన వైనం
  • దొంగ దొరికే వరకూ భయాందోళనతో ఇంట్లో ఉండలేకపోయానన్న మహిళ
  • యూకేలోని మాన్ మౌత్ షైర్ లో ఘటన
దొంగతనం చేయడానికి వెళ్లిన వ్యక్తి సైలెంట్ గా తన పని చేసుకుని వచ్చేయకుండా ఇంట్లో పనులన్నీ చేశాడు.. ఇల్లంతా నీట్ గా సర్దేశాడు. ఇంట్లో వాళ్ల కోసం భోజనం రెడీ చేసి పెట్టి వెళ్లిపోయాడు. వెళుతూ వెళుతూ ‘డోంట్ వర్రీ.. బీ హ్యాపీ’ అంటూ ఓ పేపర్ పై రాసిపెట్టి వెళ్లాడు. అయితే, ఇది చూసి ఆ ఇంటి యజమాని సంతోషించక పోగా తీవ్ర భయాందోళనకు గురైంది. ఒంటరిగా ఉండలేక స్నేహితురాలి దగ్గర ఉండిపోయింది. దొంగ దొరికేంత వరకూ ఇంటి వైపు వెళ్లడానికి భయపడింది. యూకేలోని మాన్ మౌత్ షైర్ లో జరిగిన ఈ ఘటన వివరాలు..

డేమియన్ వాజినిలోవిక్జ్ ఓ దొంగ.. గతంలో కూడా పలు నేరాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. ఇటీవల మాన్ మౌత్ షైర్ లో ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్లాడు. ఆ ఇంట్లో ఓ మహిళ ఒంటరిగా నివసిస్తోందని తెలిసి బట్టలు ఉతకడంతో పాటు ఇంటి పనంతా చేశాడు. కిచెన్, ఫ్రిజ్ అన్నీ సర్దేశాడు. ఆపై ఫ్లోర్ తుడిచి నీట్ గా చేశాడు. ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుందనే ఆలోచనతో ఇంటి యజమాని కోసం భోజనం కూడా సిద్ధం చేసి పెట్టాడు. ఇంట్లో ఉన్న రెడ్ వైన్ ను తాగి, ఆ సీసా, గ్లాసును మాత్రం టేబుల్ పై అలాగే వదిలేశాడు.

ఆపై ఇంటి యజమానిని ఉద్దేశించి దేనికీ చింతించకుండా తిని తాగి సంతోషంగా గడుపు అంటూ ఓ లెటర్ రాసి పెట్టి వెళ్లిపోయాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన యజమానురాలు ఇదంతా చూసి భయాందోళనతో పోలీసులకు ఫోన్ చేసింది. ఆ తర్వాత ఒంటరిగా ఇంట్లో ఉండడానికి భయపడి స్నేహితురాలితో కలిసి ఉంటూ వచ్చింది. తాను ఒంటరిగా ఉంటున్న విషయం తెలుసుకున్న ఆ దొంగ ఏ క్షణంలో వచ్చి ఏం చేస్తాడోననే భయపడ్డానని చెప్పింది. రెండు వారాల తర్వాత దొంగ దొరికాడని పోలీసులు ఫోన్ చేయడంతో టెన్షన్ తగ్గిందని వివరించింది.
UK Robber
burglary
Cooks Meal
Offbeat
UK

More Telugu News