zomato: తన ఉద్యోగుల పట్ల జొమాటో పెద్ద మనసు

zomato to grant nearly 12 million employee stock options worth around rs 330 crore
  • ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం
  • ఉద్యోగులకు రూ330.17 కోట్ల విలువైన షేర్లు కేటాయించిన జొమాటో
  • ఎంప్లాయి స్టాక్ ఓనర్ షిప్ కింద 1,19,97,768 షేర్లను కేటాయించేందుకు తాజాగా ఆమోదం
తన ఉద్యోగుల పట్ల ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో దొడ్డ మనసును చాటుకుంది. 12 మిలియన్ల స్టాక్‌లను తన ఉద్యోగులకు జొమాటో కేటాయించింది. ఎంప్లాయీ స్టాక్ ఓనర్ షిప్ కింద 1,19,97,768 షేర్లను కేటాయించేందుకు తాజాగా ఆమోదం తెలిపింది. దీని విలువ దాదాపు రూ.330.17 కోట్లుగా ఉంటుందని చెప్పింది. కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని తెలియజేసింది. 

మొత్తం షేర్లలో ఈఎస్ఓపీ 2021 నుంచి 1,19,97,652 షేర్లు.. మిగిలిన 116 షేర్లు ఫుడ్డీ బే ఈఎస్ఓపీ 2014 స్కీమ్ కిందకు వస్తాయి. అయితే ఎంప్లాయిస్ కు బదిలీ చేసిన ఈ షేర్లు లాకిన్ ప్రక్రియకు లోబడి ఉండవని జొమాటో తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి జొమాటో షేర్లు బీఎస్ఈలో రూ.275.20 వద్ద ముగిశాయి. 

zomato
employee stock
Business News

More Telugu News