Youtuber Harshasai: యూట్యూబర్ హర్షసాయిపై లుకౌట్ నోటీసులు జారీ

Police issues lookout notice on Youtuber Harshasai
  • ముంబయి నటిపై అత్యాచారం చేసినట్టు హర్షసాయిపై ఆరోపణలు
  • సెప్టెంబరు 24న కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు
  • కేసు దర్యాప్తు ముమ్మరం
ముంబయికి చెందిన ఓ నటిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. 

హర్షసాయి తనపై అత్యాచారం చేశాడని, తన నగ్నచిత్రాలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ముంబయి నటి ఫిర్యాదు చేయగా, నార్సింగి పోలీసులు గత నెల 24న కేసు నమోదు చేయడం తెలిసిందే. సదరు నటి గతంలో హర్షసాయితో ఓ సినిమాలో నటించింది. ఓ రియాలిటీ షోలోనూ పాల్గొంది. 

పోలీసుల కథనం ప్రకారం... హర్షసాయి, ముంబయి నటి మధ్య ఓ పార్టీలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, మొబైల్ ఫోన్ తో ఆమెను నగ్నంగా ఫొటోలు తీసి, బెదిరింపులకు పాల్పడ్డాడు. 

కాగా, ఈ కేసు దర్యాప్తు చేస్తుండగానే, హర్షసాయిపై మరో మహిళ ఫిర్యాదు చేసింది. ఆన్ లైన్ లో తన పట్ల ట్రోలింగ్ కు పాల్పడుతున్నాడంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
Youtuber Harshasai
Lookout Notice
Mumbai Actress
Cyberabad Police

More Telugu News