India vs Bangladesh: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

India vs Bangladesh Uppal Match Tickets Will Be Sold From Today
  • రేపటి నుంచి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్
  • 12న హైదరాబాద్‌లో చివరి మ్యాచ్
  • ఇప్పటికే రెండు టెస్టుల్లోనూ స్వీప్ చేసిన భారత్
  • టికెట్ ప్రారంభ ధర రూ. 750
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌‌లో తిరుగులేని విజయం సాధించిన భారత జట్టు టీ20లకు రెడీ అవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రేపు గ్వాలియర్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. 9న ఢిల్లీలో రెండో మ్యాచ్, 12న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్)లో మూడో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లో జరగనున్న మ్యాచ్ టికెట్ల విక్రయాలు నేటి మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.

టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే విక్రయించనున్నారు. పేటీఎం ఇన్‌సైడర్ యాప్, వెబ్‌సైట్‌లలో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారు 8 నుంచి 12 మధ్య సికింద్రాబాద్ జింఖానా క్రికెట్ స్టేడియంలో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి వర్చువల్ టికెట్‌ను పొందొచ్చు. టికెట్ ప్రారంభ ధర రూ. 750 కాగా, గరిష్ఠ ధర రూ. .15 వేలు.
India vs Bangladesh
T20 Series
Uppal Stadium

More Telugu News