Devara: ఘనంగా జరిగిన దేవర సక్సెస్‌ సెలబ్రేషన్స్‌

Devaras success celebrations were grand
  • హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌ వేడుక
  • హాజరైన టాలీవుడ్‌ ప్రముఖులు 
  • సక్సెస్‌ జోష్‌లో కనిపించిన ఎన్టీఆర్
ఎన్టీఆర్‌, కొరటాల శివ కలయికలో రూపొందిన ద్వితీయ చిత్రం దేవర. ఇంతకు ముందు ఈ కాంబినేషన్‌లో జనతా గ్యారేజీ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 27న పాన్‌ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవర టాక్‌పరంగా మిక్స్‌డ్‌ రియాక్షన్స్‌ వచ్చినా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. దసరా సెలవులు ఈ చిత్రానికి బిగ్గెస్ట్‌ అడ్వాంటేజీగా మారాయి. రానున్న రోజుల్లో పెద్ద చిత్రమేమీ లేకపోవడంతో దసరా సెలవుల్లో దేవరదే హవా అని డిసైడ్‌ అయిపోయింది. 

ఇదిలా వుండగా ఈ సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందు అమెరికాకు వెళ్లిన హీరో ఎన్టీఆర్‌ బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. వాస్తవంగా గురువారం రోజు ఈ చిత్రం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ వేడుక గుంటూరులో అభిమానుల మధ్య జరగాలి. అయితే అనుకోని కారణాల వల్ల కుదరలేదు. దేవి నవరాత్రుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సక్సెస్‌మీట్‌కు పోలీసుల అనుమతి లభించలేదు. 

ఈ విషయమై దేవర పంపిణీదారుడు, నిర్మాత నాగవంశీ అభిమానులను క్షమాపణలు కూడా కోరిన సంగతి తెలిసిందే. కాగా దేవర సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ టాలీవుడ్‌ ప్రముఖుల సమక్షంలో గురువారం హైదరాబాద్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో ఘనంగా జరిగాయి. అభిమానులకు, మీడియాకు దూరంగా జరిగిన ఈ వేడుకకు హీరో ఎన్టీఆర్‌తో పాటు చిత్రంలో నటించిన ఇతర నటీనటులు, ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళితో పాటు నిర్మాతలు దిల్‌రాజు, నందమూరి కళ్యాణ్‌రామ్‌, దానయ్య, నాగవంశీ, దేవర పంపిణీదారులు తదితరులు పాల్గొన్నారు. 
Devara
Ntr
Devara success celebrations
Koratala Siva

More Telugu News