Sabitha Indra Reddy: రేవంత్ రెడ్డి నన్ను ఎంతగా టార్గెట్ చేసినా ప్రశ్నిస్తూనే ఉంటా: సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy says will questions government anyway
  • మాకు మూడు ఫామ్ హౌస్‌లు ఎక్కడ ఉన్నాయో చూపించాలన్న మాజీ మంత్రి
  • మా అబ్బాయి కడుతున్న ఇల్లు మినహాయించి మరేమీ లేదన్న సబితా ఇంద్రారెడ్డి
  • తనకు పేద ఏడుపులు ఏడ్చే పరిస్థితిని దేవుడు కల్పించలేదన్న బీఆర్ఎస్ నేత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా తనను ఎంతగా టార్గెట్ చేసినా ప్రజల తరఫున ప్రశ్నించడం మాత్రం ఆపేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డి తనయుల ఫామ్ హౌస్‌లు కూల్చాలా? వద్దా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారని, కానీ అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలన్నారు.

మా అబ్బాయి కడుతున్న ఇల్లును మినహాయించి, మీరు చెప్పినట్లుగా మరో మూడు ఫామ్ హౌస్‌లు మాకు ఎక్కడ ఉన్నాయో బయటపెట్టాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి మాట తీరును తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. ఆత్మాభిమానం కంటే మించిన ఆస్తి లేదని గుర్తించాలన్నారు. సీఎం ముందు లేదా ఇంకెవరి వ్యక్తుల ముందైనా పేద ఏడుపులు ఏడ్చే పరిస్థితిని తనకు దేవుడు కల్పించలేదన్నారు.
Sabitha Indra Reddy
BRS
Congress
Telangana

More Telugu News