Viral Videos: బెంగళూరులో ట్రాఫిక్ జామ్.. రోడ్డు పక్కన డ్యాన్స్ చేస్తున్న యువకులతో కలిసి చిందేసిన యువతి.. వీడియో ఇదిగో!

Bengaluru traffic jam turns into dance floor as woman joins street performers
  • ట్రాఫిక్ జామ్ కారణంగా ఆగిన ఆటో
  • రోడ్డుకు ఆవలిపక్కన డ్యాన్స్ చేస్తున్న యువకుల వద్దకు వెళ్లి చిందేసిన యువతి
  • కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
ట్రాఫిక్ జామ్‌లకు బెంగళూరు పెట్టింది పేరు. షరా మామూలుగా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ఓ యువతి ఆటో దిగి రోడ్డు పక్కన డ్యాన్స్ పార్టీలో చిందులేసి మళ్లీ ఆటో ఎక్కిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం యువతి తన స్నేహితురాలితో ఆటోలో ప్రయాణిస్తోంది. ట్రాఫిక్ జామ్ కారణంగా ఆటో ఆగింది. అదే సమయంలో రోడ్డుకు ఆవలి పక్కన కూడా ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ డ్యాన్సర్ గ్రూపు ఆగింది. 

వారి డ్యాన్స్‌ను చూసి ఉత్సాహం ఆపుకోలేకపోయిన యువతిని స్నేహితురాలు ప్రోత్సహించింది. ‘వెళ్లె వెళ్లు’ అని అనడం వీడియోలో వినిపించింది. వెంటనే రోడ్డు దాటిన ఆమె డ్యాన్స్ చేస్తున్న వారి వద్దకు వెళ్లి వారితో కలిసి స్టెప్పులేసింది. దీంతో వారు మరింత ఉత్సాహంగా చిందులేశారు. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ఇతర ప్రయాణికులు కూడా దీనిని ఎంజాయ్ చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పటి వరకు 1.3 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక కామెంట్లకు అయితే లెక్కేలేదు. ఆమె అక్కడికి వెళ్లగానే డ్యాన్స్ గ్రూపులోని వారి ఉత్సాహం రెట్టింపు అయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తానీరోజు చూసిన బెస్ట్ వీడియోల్లో ఇదొకటని మరో యూజర్ కామెంట్ చేశాడు.
Viral Videos
Bengaluru
Karnataka
Traffic Jam

More Telugu News