Heavy Rains: హైదరాబాద్‌లో నేడు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

 IMD forecasts heavy rains in Hyderabad issues yellow alert
  • గత నాలుగు రోజులుగా కురుస్తున్న వానలు
  • నేడు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరిక
  • నిన్న కామారెడ్డిలో అత్యధికంగా 97.3 మిల్లీమీటర్ల వాన
హైదరాబాద్‌లో నేడు భారీ వర్షం పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రతిరోజూ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న హైదరాబాద్, కామారెడ్డి, నిర్మల్, సిద్దిపేట, నాగర్‌కర్నూల్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలలో భారీ వర్షం కురిసింది. నిన్న కామారెడ్డిలో అత్యధికంగా 97.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పాటిగడ్డలో 40 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. 

నేడు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణశాఖ (ఐఎండీ) ఎల్లో అలెర్ట్ జారీచేసింది. కాగా, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో హైదరాబాద్‌కు తాగునీటిని అందించే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి.
Heavy Rains
Hyderabad
Medchal Malkajgiri District
IMD
Yellow Alert

More Telugu News