Hassan Nasrallah: హిజ్బొల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టిన పైలెట్ కు అపూర్వ స్వాగతం... వీడియో వైరల్

The Pilot who eleminated Nasralla gets grand welcome
  • లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం
  • నస్రల్లా ఓ బంకర్ లో దాగినప్పటికీ, వేటాడిన ఇజ్రాయెల్
  • ఎన్నో ఏళ్లుగా ఇజ్రాయెల్ కు సవాల్ గా మారిన నస్రల్లా
ఇటీవల హమాస్ ఉగ్రవాద సంస్థ తన భూభాగంపై దాడి చేసినప్పటి నుంచి ఇజ్రాయెల్ ఆగ్రహజ్వాలలతో రగిలిపోతోంది. ఉగ్రవాద నేతలు ఎక్కడ దాక్కున్నా సరే వెతికి వేటాడుతోంది. ఎప్పటినుంచో సవాల్ గా మారిన హిజ్బొల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లాను కూడా మట్టుబెట్టింది. 

లెబనాన్ రాజధాని బీరూట్ లో 60 అడుగుల లోతులో ఉన్న బంకర్ లో దాగిన నస్రల్లాను అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులతో కడతేర్చింది. నస్రల్లాను హతమార్చేందుకు ఇజ్రాయెల్ ఒక్కోటి టన్ను బరువు ఉంటే బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించింది. 

కాగా, నస్రల్లాను అంతమొందించి, ఆపరేషన్ ను విజయవంతంగా ముగించుకుని వచ్చిన ఇజ్రాయెల్ పైలెట్ కు వైమానిక స్థావరంలో అపూర్వ స్వాగతం లభించింది. సహచర సైనికులు పాటలు, డ్యాన్సులతో అతడికి స్వాగతం పలికారు. నస్రల్లాను ఈ భూమ్మీద లేకుండా చేయడం అనేది ఇజ్రాయెలీలకు ఎంత ముఖ్యమో... సైనికుల సంబరాలు చూస్తే అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Hassan Nasrallah
Hezbollah
Pilot
Israel
Lebanon

More Telugu News