Mallik Teja: తెలంగాణ జానపద గాయకుడు మల్లిక్ తేజపై అత్యాచార కేసు

Police files case against Telangana folk singer Mallik Teja
  • అత్యాచారం చేసి బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నాడన్న యువతి
  • కేసు నమోదు చేసుకున్న జగిత్యాల పోలీసులు
  • దర్యాప్తు ప్రారంభం
తెలంగాణ జానపద గాయకుడు మల్లిక్ తేజ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్లిక్ తేజ తనపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడని, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ, వేధిస్తున్నాడని ఆ యువతి జగిత్యాల పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున దర్యాప్తు ప్రారంభించారు. 

మల్లిక్ తేజ తెలంగాణ సాంస్కృతిక సారథి (టీఎస్ఎస్) సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ సంస్థ ప్రభుత్వ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నడుస్తోంది. కాగా, మల్లిక్ తేజా, బాధితురాలు గత కొన్నేళ్లుగా సాంస్కృతిక కార్యక్రమాలలో కలిసి పనిచేస్తున్నారు. తమ యూట్యూబ్ చానళ్లలో అనేక పాటలను అప్ లోడ్ చేశారు.

అయితే, మల్లిక్ తేజ తనపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా, తనను, తన కుటుంబ సభ్యులను దూషిస్తున్నాడని ఆ యువతి తెలిపింది. తన యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ల పాస్ వర్డ్ లను కూడా మార్చేశాడని... తద్వారా తనను మానసికంగా వేధించాడని ఆరోపించింది.
Mallik Teja
Folk Singer
Police Case
Woman
Telangana

More Telugu News