Rajinikanth: తిరుపతి లడ్డూ వివాదంపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఏమన్నాడో తెలుసా?

Do you know what Superstar Rajinikanth said about the Tirupati Laddu controversy
  • వేట్టయాన్‌ ప్రమోషన్స్‌లో తిరుపతి లడ్డూపై ప్రశ్న 
  • నో కామెంట్స్‌ అంటూ సమాధానమిచ్చిన రజనీకాంత్‌
  • అక్టోబర్‌ 10న విడుదల కానున్న వేట్టయాన్‌
ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలపై హిందువాదులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. కల్తీ ఆరోపణలపై విచారణ జరిపించి నిజ నిజాలు తేల్చి కల్తీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వివాదంపై కొంత మంది సినీతారలు, పొలిటికల్‌ లీడర్స్‌ కూడా స్పందిస్తున్నారు. ఇదే విషయంపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను అడిగితే, సమాధానం చెప్పడానికి ఆయన ఆసక్తి చూపలేదు. రజనీ తన తాజా చిత్రం వేట్టయాన్‌ ప్రమోషన్స్‌లో  పాల్గొంటున్నారు. 

ఇందులో భాగంగానే ఓ ఈవెంట్ లో ఆయన్ని పలువురు విలేకర్లు వేట్టయాన్‌ సినిమా గురించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అందులో ఓ విలేకరి 'తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటి? అని ప్రశ్నించగా... సారీ నో కామెంట్స్‌ అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  

రజనీకాంత్‌ హీరోగా నటించి వేట్టయాన్‌ అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవల సత్యం సుందరం ప్రీరిలీజ్‌ వేడుకలో పాల్గొన్న తమిళ నటుడు కార్తీ 'ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు.. సున్నితమైన అంశం' అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. 

ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో బాగా ప్రచారం కావడంతో ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవన్‌ కల్యాణ్‌ ఆయన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. "సనాతన ధర్మం విషయంలో సరదాగా మాట్లాడకూడదు. సినిమా నటులు ఈ అంశంపై హుందాగా మాట్లాడండి.. లేకపోతే మౌనంగా కూర్చోండి. మీ మాధ్యమాల ద్వారా కామెడీగా మాట్లాడితే ప్రజలు క్షమించరు. లడ్డూ వివాదంపై జోకులేయకండి" అని అంటూ పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో, వెంటనే స్పందించిన కార్తీ... ఈ విషయంలో తనను క్షమించాలని కోరిన సంగతి తెలిసిందే.

Rajinikanth
Tirupathi laddu
vettaiyan
Rajinikanth latest movie
Tollywood
Karthi

More Telugu News