TTD: అన్యమతస్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం... తిరుమలలో బోర్డులు ఏర్పాటు

TTD decides to display boards for non Hindus
  • జగన్ తిరుమల పర్యటన ప్రకటనతో తెరపైకి డిక్లరేషన్ అంశం
  • హిందూయేతరులు పాటించాల్సిన నిబంధనలతో బోర్డులు 
  • టీటీడీ నిబంధనలు తప్పక పాటించాల్సిందేనన్న సీఎం చంద్రబాబు
వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటనకు వెళతానని ప్రకటన వెలువడగానే, అన్యమతస్తులు-డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ఇతర మతాల వారి కోసం బోర్డులు ఏర్పాటు చేయనుంది. అన్యమతస్తులు తిరుమల వచ్చినప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలను ఆ బోర్డుల్లో పొందుపరచనున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్, గోకులం గెస్ట్ హౌస్ వద్ద ఈ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. 

శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందేనని సీఎం చంద్రబాబు ఇప్పటికే ట్వీట్ చేసిన నేపథ్యంలో... టీటీడీ బోర్డుల ఏర్పాటు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
TTD
Boards
Non Hindu
Tirumala

More Telugu News