Bhumana Karunakar Reddy: జగన్ ఎందుకు సంతకం చేయాలి?: భూమన కరుణాకర్ రెడ్డి

Why should Jagan sign declaration asks Bhumana Karunakar Reddy
  • తిరుమల డిక్లరేషన్ పై జగన్ సంతకం పెట్టరన్న భూమన
  • సంతకం చేయకుండానే స్వామివారిని దర్శించుకుంటామని వ్యాఖ్య
  • తమను ఎవరూ అడ్డుకోలేరన్న టీటీడీ మాజీ ఛైర్మన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠను రేకెత్తించిన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిపై తమకు విశ్వాసముందంటూ డిక్లరేషన్ లో జగన్ సంతకం చేయాల్సిందేనని కూటమి నేతలు, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. 

డిక్లరేషన్ పై జగన్ ఎందుకు సంతకం పెట్టాలని భూమన ప్రశ్నించారు. జగన్ ఆ పని చేయరని స్పష్టం చేశారు. సంతకం చేయకుండానే శ్రీవారిని దర్శించుకుంటామని చెప్పారు. తమను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. మరోవైపు చివరి క్షణంలో తిరుమల పర్యటనను జగన్ రద్దు చేసుకోవడం గమనార్హం.
Bhumana Karunakar Reddy
Jagan
YSRCP
Tirumala

More Telugu News