బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌లో యువ‌కుడి జ‌ననాంగాల‌కు నిప్పంటించిన స్నేహితులు... వీడియో వైర‌ల్‌!

Friends Set Fire on Youth Private Parts Video goes Viral on Social Media
  • స్నేహితుడి బర్త్‌డేలో యువ‌కుల అతి
  • నిద్ర‌లో ఉన్న యువ‌కుడి జ‌న‌నంగాల‌కు నిప్పు పెట్టిన వైనం
  • ఆ త‌ర్వాత హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ కేక‌లు
ఇటీవ‌ల పుట్టిన‌రోజు వేడుక‌ల పేరిట కొంద‌రు చేస్తున్న అతి వ‌ల్ల ప్రాణాలు మీద‌కు వ‌స్తున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇదే కోవ‌కు చెందిన ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. కొంద‌రు స్నేహితులు ఓ యువ‌కుడి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అత‌ని ప్రైవేట్ పార్ట్‌కి నిప్పంటించ‌డం ఆ వీడియోలో ఉంది.  

'ఘ‌ర్‌ కే కాలేష్' అనే ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతాలో ఈ వీడియో రెండు రోజుల క్రితం పోస్ట్ అయింది. కొంద‌రు మిత్రులు ఓ యువ‌కుడు గ‌దిలో నిద్ర‌పోతున్న స‌మ‌యంలో అత‌ని వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత త‌మ‌తో పాటు తెచ్చుకున్న ఓ లిక్విడ్‌ను నిద్ర‌లో ఉన్న యువ‌కుడి జ‌న‌నాంగాల‌పై పోసి నిప్పంటించారు. అనంత‌రం హ్యాపీ బ‌ర్త్ డే అంటూ గ‌ట్టిగా అర‌వ‌డం చేశారు. 

దాంతో ఒక్క‌సారిగా నిద్ర‌లేచిన యువ‌కుడు నిప్పును ఆర్పివేసి, వారిని కొట్ట‌డానికి వెళ్ల‌డం వీడియోలో ఉంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే, ఇది ఎక్క‌డ‌, ఎప్పుడు జ‌రిగింద‌నే విష‌యం తెలియ‌దు. దీనిపై నెటిజ‌న్లు త‌మదైన శైలిలో స్పందిస్తున్నారు.
Go Back to Shorts
Viral Videos
Fire
Birthday Celebrations
Social Media

More Telugu News