Devara: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో దేవర రికార్డు... ఎలాగంటే...!

devara becomes the firstever indian movie to achieve this feat in aus
  • దేవర మూవీకి విడుదలకు ముందే పలు రికార్డులు
  • తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్న దేవర
  • ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ ఆట్ మోస్ షోలు ప్రదర్శించనున్న దేవర
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మూవీ ఈరోజు (సెప్టెంబర్ 27) ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం దేవర ట్రెండింగ్ లో ఉండగా, ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్న దేవర మూవీ తాజాగా మరో ఘనత సాధించింది. 

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ ఆట్‌మోస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ మూవీగా దేవర నిలిచింది. ఆస్ట్రేలియాలో 13 స్క్రీన్స్‌లో, న్యూజిలాండ్‌లో మూడు స్క్రీన్స్‌లోనూ ఈ మూవీ విడుదల అవుతోంది.
Devara
Movie News

More Telugu News