Yuvaraj Singh: ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మలలో అత్యుత్తమ కెప్టెన్ ఎవరన్న ప్రశ్నకు యూవీ ఆసక్తికర సమాధానం

yuvraj singh reveals his all time favourite india captain
  • మైఖేల్ వాన్, అడమ్ గిల్ ‌క్రిస్ట్‌తో కలిసి ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న యువరాజ్ సింగ్ 
  • రోహిత్ తన బ్యాటింగ్‌తో క్షణాల్లో మ్యాన్‌ను మార్చగల అత్యుత్తమ కెప్టెన్ అని పేర్కొన్న యువీ  
  • టీ 20 ఫార్మాట్‌కు కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి వస్తే తాను రోహిత్ శర్మను ఎంచుకుంటానని వెల్లడి  
యువరాజ్ సింగ్ (యూవీ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  భారత క్రికెట్ లో అత్యుత్తమ క్రీడాకారుల్లో మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఒకరు. 2007 టీ 20 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్ టీమ్ ఇండియా సాధించడంలో యువరాజ్ కీలకపాత్ర పోషించారు. అయితే తాజాగా యువీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ అడమ్ గిల్ ‌క్రిస్ట్ తో కలిసి యువీ ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంలో విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మలలో ఎవరిని అత్యుత్తమ కెప్టెన్‌గా భావిస్తారన్న ప్రశ్నకు యువీ ఆసక్తికరమైన జవాబు చెప్పారు. టీ 20 ఫార్మాట్ కు కెప్టెన్ ను ఎంపిక చేయాల్సి వస్తే తాను రోహిత్ శర్మను ఎంచుకుంటానని అన్నారు. రోహిత్ తన బ్యాటింగ్ తో క్షణాల్లో మ్యాచ్ తీరును మార్చగల అత్యుత్తమ కెప్టెన్ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నారు. అందుకే కచ్చితంగా రోహిత్ తన ఫస్ట్ ఛాయిస్ అని యువీ సమాధానం ఇచ్చారు. ‌
Yuvaraj Singh
Sports News
Rohit Sharma

More Telugu News