Bengaluru Horror: బెంగళూరు మహలక్ష్మిని 50 ముక్కలుగా నరికిన నిందితుడి ఆత్మహత్య

Mahalakshmi Murder Case Suspected killer who chopped woman into 50 pieces commits suicide
  • ఒడిశాలోని స్వగ్రామంలో చెట్టుకు ఉరేసుకున్న నిందితుడు
  • పోలీసులు తన కోసం వస్తున్నారని తెలిసి ఆత్మహత్య
  • దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహలక్ష్మి హత్యకేసు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు మహిళ హత్య కేసు నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఓ మాల్‌లో పనిచేస్తున్న 26 ఏళ్ల మహలక్ష్మిని దారుణంగా హత్య చేసిన నిందితుడు ఆమె మృతదేహాన్ని 50 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టాడు. తాజాగా అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

నిందితుడిని ఆమెతో పనిచేసే ముఖ్తిరాజన్ రాయ్‌గా గుర్తించారు. ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన నిందితుడు అక్కడ ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. బుధవారం పాండి గ్రామానికి చేరుకున్న ముఖ్తిరాజన్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత బైక్‌పై బయటకు వెళ్లాడు. స్థానికులు అతడి మృతదేహాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

మహలక్ష్మిని హత్య చేసిన అనంతరం ఒడిశా పారిపోయిన నిందితుడి కోసం కర్ణాటక పోలీసులు ఒడిశాకు నాలుగు బృందాలను పంపారు. ఈ నేపథ్యంలో విషయం తెలిసిన నిందితుడు పట్టుబడతానన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.

మహలక్ష్మి చివరిసారి ఈ నెల 1న డ్యూటీ చేసింది. 2 లేదంటే 3న నిందితుడు ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. త్రిపురకు చెందిన మహలక్ష్మి పనిచేస్తున్న చోట అతడు టీం హెడ్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
Bengaluru Horror
Mahalakshmi
Odisha
Bengaluru
Crime News

More Telugu News