IPS: ఏపీలో 16 మంది ఐపీఎస్ ల బదిలీ... సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్

AP Govt transfers 16 IPS officials
  • ఏపీలో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం
  • మరోసారి ఐపీఎస్ లకు స్థానచలనం
  • ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి ఐపీఎస్ లకు స్థానచలనం కలిగింది. నేడు 16 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ ను నియమించింది. 

పీ అండ్ ఎల్ ఐజీగా ఎం.రవిప్రకాశ్, ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ, ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప, డీజీపీ కార్యాలయంలో డీఐజీ (అడ్మిన్)గా అమ్మిరెడ్డి, రోడ్ సేఫ్టీ అథారిటీ డీఐజీగా సీహెచ్ విజయరావు, లా అండ్ ఆర్డర్ ఏఐజీగా సిద్ధార్థ్ కౌశల్, విశాఖ శాంతిభద్రతల డీసీపీగా మేరీ ప్రశాంతి, అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హా, ఏపీఎస్పీ-3 బెటాలియన్ కమాండెంట్ గా దీపిక, ఒంగోలు పోలీస్ శిక్షణ కళాశాల (పీటీసీ) ప్రిన్సిపల్ గా జి.రాధిక, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్, పీటీవో ఎస్పీగా కె.ఎస్.ఎస్.వి సుబ్బారెడ్డి, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్డ్ గా బాపూజీ అట్టాడ, ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ లో క్రైమ్ డీసీపీగా తిరుమలేశ్వర్ రెడ్డి, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్డ్  గా శ్రీనివాసరావులను బదిలీ చేశారు. 

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
IPS
Transfer
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News