Elon Musk: ఇటలీ ప్రధానితో ఎలాన్ మస్క్ డేటింగ్ చేస్తున్నారా?... వైరల్‌గా మారిన ఫొటో

A picture of Elon Musk with Itali PM Giorgia Meloni gone viral on Social Media
  • అవార్డుల కార్యక్రమంలో మెలోనీపై ప్రశంసలు కురిపించిన మస్క్
  • డేటింగ్ లాంటిదేమీ లేదన్న మస్క్
  • సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చ
ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధానమంత్రి మెలోనీ ఇద్దరూ దగ్గరగా కూర్చొని.. ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి తోడు మెలోనీపై మస్క్ ప్రశంసల జల్లు కురిపించడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారా? అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

‘‘నేను అభిమానించే వ్యక్తుల్లో మెలోనీ ఒకరు. ఇటలీ ప్రధానమంత్రిగా అద్భుతమైన సేవలు అందించారు. ఆమె ప్రామాణికమైన, నిజాయతీ గల వ్యక్తి. రాజకీయ నాయకుల విషయంలో ఎల్లప్పుడూ ఈ మాట చెప్పలేం. మెలోనీ బయటకు కనిపించే దానికంటే మరింత అందమైన వ్యక్తి’’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. 

న్యూయార్క్ నగరంలో నిన్న జరిగిన ‘అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డు’ కార్యక్రమంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. మెలోనీకి అవార్డు అందజేసిన అనంతరం ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఇక తనను అంతలా పొడగిన మస్క్‌కు ఎక్స్ వేదికగా మెలోనీ ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. 

టెస్లా ఫ్యాన్ క్లబ్ ఒక ఫొటోను పోస్ట్ చేసి... ‘‘వాళ్లు డేటింగ్ చేస్తారని మీరు భావిస్తున్నారా?’’ అని నెటిజన్ల అడిగింది. దీనిపై ఎలాన్ మస్క్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. "డేటింగ్ చేయడం లేదు" అని సమాధానం ఇచ్చారు. కాగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు మెలోనీ అమెరికాలో ఉన్నారు.
Elon Musk
Giorgia Meloni
Viral News

More Telugu News