HYDRA: అత్తాపూర్ వద్ద మూసీ నదిలో నిర్మాణాలను పరిశీలించిన అధికారులు

Officials inspects buildings at Musi River
  • ఆర్డీవో వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మూసీనదిని పరిశీలించిన అధికారులు
  • నాలుగు బృందాలుగా ఏర్పడి పరిశీలించిన అధికారులు
  • నివాసాలు, దుకాణాల అనుమతుల వివరాల సేకరణ
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ వద్ద మూసీ నదిలో నిర్మాణాలను ఆర్డీవో వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు నేడు పరిశీలించారు. అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఈ ప్రాంతంలోని నివాసాలు, దుకాణాల అనుమతుల వివరాలు సేకరిస్తున్నారు. 

మూసీ పరివాహక ప్రాంతాల్లోని నిర్వాసితులకు ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 16 వేల ఇళ్లను మూసీ నిర్వాసితులకు ఇచ్చేలా నిన్న ప్రభుత్వం జీవోను జారీ చేసింది. 

కొన్ని నెలలుగా 3 జిల్లాల పరిధిలోని మూసీ నదిపై సర్వే జరిగింది. రెవెన్యూ అధికారులు నదీ గర్భంలో, బఫర్ జోన్‌లో 10,200 నిర్మాణాలను గుర్తించారు. ఆ నిర్మాణాల్లో ఎవరెవరు ఉన్నారో గుర్తించేందుకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.
HYDRA
Musi
Hyderabad

More Telugu News