Mohan Babu: మోహన్ బాబు ఇంట్లో దొంగతనం

Theft in Actor Mohan Babu home
  • జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసంలో రూ. 10 లక్షల చోరీ
  • నమ్మకంగా ఉంటూనే చోరీ చేసిన గణేశ్
  • గణేశ్ ని తిరుపతిలో అరెస్ట్ చేసిన పోలీసులు
సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ జల్ పల్లిలో ఉన్న సువిశాలమైన ఇంట్లో ఆయన నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ ఇంట్లో ఎన్నో ఏళ్లుగా గణేశ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఆ వ్యక్తే చోరీకి పాల్పడ్డాడు. మోహన్ బాబు వద్ద నమ్మకంగా ఉంటూనే చోరీ చేసేందుకు గణేశ్ స్కెచ్ వేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రూ. 10 లక్షల రూపాయలు తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత గణేశ్ కనిపించలేదు. అనుమానం వచ్చి చూడగా రూ. 10 లక్షలు మాయమైనట్టు గుర్తించారు. దీంతో పహాడిషరీఫ్ పోలీసులకు మోహన్ బాబు మేనేజర్ కిరణ్ తేజ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... గణేశ్ కోసం గాలించారు. చివరకు తిరుపతిలో అరెస్ట్ చేశారు.
Mohan Babu
Tollywood

More Telugu News