Bengaluru Horror: మహలక్ష్మిని ముక్కలుగా నరికిన కిరాతకుడికి ‘సడోమా సూకిస్టిక్’!

Killer Who Killed Bengaluru Mahalakshmi Is Suffering From SADOMASOCHISTIC
  • బెంగళూరులో సంచలనం సృష్టించిన మహలక్ష్మి హత్య
  • నిందితుడిని పట్టుకోకుంటే మరింత ప్రమాదమని వైద్యుల హెచ్చరిక
  • సడోమా సూకిస్టిక్‌తో బాధపడుతున్న వారు శరీర భాగాలను నరకడంలో ఆనందం పొందుతారంటున్న వైద్యులు
  • నిందితుడి కోసం గాలింపు తీవ్రం
బెంగళూరులో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ‘సడోమా సూకిస్టిక్’ అనే నేరస్వభావంతో రగిలిపోయినట్టు వైద్యులు గుర్తించారు. నిందితుడిని వెంటనే కటకటాల వెనక్కి పంపకుంటే మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుందని పోలీసులను హెచ్చరించారు. నెలమంగళ సమీపంలో ఒంటరిగా నివసిస్తున్న మహలక్ష్మి (29)ని హత్యచేసి, ఆమె శరీరాన్ని 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో కుక్కేశాడు. రిఫ్రిజిరేటర్ ఆన్‌లోనే ఉన్నప్పటికీ దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

మహలక్ష్మి మృతదేహాన్ని నిందితుడు 30 ముక్కలుగా నరికినట్టు పోలీసులు చెప్పగా, వైద్య పరీక్షల్లో మాత్రం 50 ముక్కలుగా తేలింది. ఒక్క తలనే మూడు భాగాలుగా పగలగొట్టినట్టు గుర్తించారు. సడోమా సూకిస్టిక్‌తో బాధపడేవారు శరీర భాగాన్ని నరికే సమయంలో ఆనందం పొందుతారని చెబుతున్నారు.

ఈ హత్య వెనక ఒక్కరే ఉన్నారా? లేదంటే ఇద్దరుముగ్గురు ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మల్లేశ్వరంలోని దుస్తుల దుకాణంలో కలిసి పనిచేసే సమయంలో ఆమె పరిచయమైందని, అది ప్రేమగా మారిన ఆరు నెలల క్రితం విడిపోయినట్టు అతడు చెప్పినట్టు తెలిసింది. తనకు దూరం కావడాన్ని తట్టుకోలేకపోయిన యువకుడు ఆమెతో పలుమార్లు గొడవపడినట్టు గుర్తించారు. కాగా, అసలు నిందితుడి కోసం పోలీసుల ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతోపాటు నగరంలోనూ గాలిస్తున్నారు.
Bengaluru Horror
Crime News
Sadomasochism
SADOMASOCHISTIC

More Telugu News