Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి మోసం చేశాడని హీరోయిన్ ఫిర్యాదు

Case has been registered against YouTuber Harsha Sai and his father
  • తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్షసాయి మోసం చేశాడని ఫిర్యాదు
  • నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మిత్ర
  • హర్షసాయితో పాటు అతని తండ్రి కూడా ఫిర్యాదు
ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడని యూట్యూబర్ హర్షసాయిపై మిత్ర అనే నటి ఫిర్యాదు చేసింది. తన న్యాయవాదితో కలిసి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో సదరు యువతి ఫిర్యాదు చేసింది. హర్షసాయితో పాటు అతని తండ్రిపై కూడా ఫిర్యాదు చేసింది.

తనను పెళ్లి చేసుకుంటానని హర్షసాయి నమ్మించాడని మిత్ర తన ఫిర్యాదులో పేర్కొంది. హర్షసాయికి రూ.2 కోట్లు కూడా ఇచ్చినట్లు తెలిపింది. యూట్యూబర్ హర్షసాయి స్వీయ దర్శకత్వంలో 'మెగా' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాను నిర్మించి, హీరోయిన్‌గా నటించిన మిత్ర పోలీసులకు హర్షసాయిపై ఫిర్యాదు చేసింది. హర్షసాయికి రూ.2 కోట్ల వరకు ఇచ్చానని తెలిపింది.
Harsha Sai
Police
Tollywood
YouTube

More Telugu News