Tirumala Laddu case: తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణకు సిట్ ఏర్పాటు

The AP government has set up a SIT to investigate the Tirumala Laddu case
  • సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నియామకం
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
  • సిట్ బృందంలో పలువురు కీలక అధికారులకు చోటు
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యిని వాడిన వివాదం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంలో నిజానిజాలు తేలాలంటూ హిందూ ధార్మిక సంస్థలు, సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 

తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్‌ రాజు ఉండనున్నారు. వీరితో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉండనున్నారని ప్రభుత్వం వివరించింది.

కాగా లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై సిట్ వేస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇదివరకే సంకేతాలు ఇచ్చారు. సిట్ చీఫ్ ఎంపికపై కసరత్తు పూర్తవడంతో ప్రభుత్వం ఇవాళ ఈ ప్రకటన చేసింది.
Tirumala Laddu case
SIT
Andhra Pradesh
Sarvashreshth Tripathi

More Telugu News