Johnny Master: జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై విచారణ పూర్తి... తీర్పు వాయిదా

Rangareddy Court postponed judgment on Johnny Master petition
  • మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక ఆరోపణల కేసు
  • గోవాలో జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు
  • ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసుల పిటిషన్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కోర్టు... తీర్పును రేపటికి వాయిదా వేసింది. జానీ మాస్టర్‌ను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని నార్సింగి పోలీసులు నిన్న పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్‌పై కోర్టు ఈరోజు విచారణ జరిపింది. విచారణ అనంతరం తీర్పును వాయిదా వేసింది.

ఓ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఈ నెల 19న నార్సింగి పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్‌పై గోవా నుంచి అతనిని హైదరాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత అతనిని రంగారెడ్డి కోర్టులో హాజరుపరచడంతో... కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
Johnny Master
Rangareddy
Tollywood

More Telugu News