IAS: ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగింత

AP govt alloted additional charges to four IAS officers
 
ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్ కు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కేటాయించారు. ఏపీ మార్క్ ఫెడ్ ఎండీ మనజీర్ జిలానీ సమూన్ కు స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. 

ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ఎస్.రామసుందర్ రెడ్డికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ గా...  ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎండీ దినేశ్ కుమార్ కు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
IAS
Additional Charges
Andhra Pradesh

More Telugu News