Laapataa Ladies: 29 సినిమాలను దాటుకుని ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘లాపతా లేడీస్’

Laapataa Ladies is Indias official entry for the 97th Academy Awards
  • గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ‘లాపతా లేడీస్’
  • విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ
  • కల్కి 2898 ఏడీ, హనుమాన్ సినిమాలను దాటుకుని ఎంట్రీ 
ప్రపంచవ్యాప్తంగా అప్పుడే ఆస్కార్ సందడి మొదలైంది. చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డును దక్కించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి సినిమాలు పోటీపడతాయి. భారత్ నుంచి ఈసారి బాలీవుడ్ మూవీ ‘లాపతా లేడీస్’ అధికారికంగా ఆస్కార్‌కు నామినేట్ అయింది. 

ఈ మూవీకి బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వం వహించారు. ఆమిర్‌ఖాన్ నిర్మాతగా వ్యవహరించారు. ఉత్తమ విదేశీ చిత్రంలో ఈ మూవీ నామినేట్ అయింది. దేశం నుంచి మొత్తం 29 సినిమాలు పోటీ పడగా చివరికి లాపతా లేడీస్ ఎంట్రీకి అర్హత సాధించింది. 

గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. బాక్సాఫీసు వద్ద కూడా మంచి విజయాన్ని అందుకుంది. స్పర్స్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది ప్రతిష్ఠాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ దీనిని ప్రదర్శించారు. మెల్‌బోర్న్ క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగానూ అవార్డు అందుకుంది. లాపతా లేడీస్‌తో పోటీపడిన మిగతా చిత్రాల్లో హనుమాన్, కల్కి2898 ఏడీ కూడా ఉన్నాయి.
Laapataa Ladies
Bollywood
Oscar2025
Kalki 2898AD

More Telugu News