Chiranjeevi: మీకు కృతజ్ఞతలు తెలపడానికి నాకు మాటలు సరిపోవడం లేదు: చిరంజీవి

Chiranjeevi on achieving Guinness record
  • గిన్నిస్ రికార్డును దక్కించుకున్న చిరంజీవి
  • నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్స్, ప్రేక్షకుల వల్లే ఇది సాధ్యమయిందన్న చిరు
  • అభినందనలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ లో చోటు ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. 150కి పైగా సినిమాల్లో అత్య‌ధిక డ్యాన్స్ స్టెప్పులతో అల‌రించినందుకు గాను ఆయ‌న‌కు ఈ అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తనకు అభినందనలు తెలియజేసిన వారికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.

ఎక్స్ వేదికగా చిరు స్పందిస్తూ... "నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ఏదో ఒకటి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. సంవత్సరాలుగా నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్క నిర్మాత, దర్శకుల వల్లనే ఇది సాధ్యమైంది. అద్భుతమైన పాటలను కంపోజ్ చేసిన సంగీత దర్శకులు, నాకు మరుపురాని డ్యాన్స్ మూవ్‌లను అందించిన కొరియోగ్రాఫర్‌లు, ఇన్నాళ్లూ నా పనిని మెచ్చుకున్న సినీ ప్రేక్షకులందరివల్లే ఇది సాధ్యమయింది. 

నాకు శుభాకాంక్షలు తెలిపిన, నన్ను అభిమానించిన మిత్రులు, సహోద్యోగులు, నా ప్రియమైన అభిమానులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, పెద్దలు, రాజకీయ, మీడియా ప్రముఖులు, పాత్రికేయులు, గౌరవ మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు మరియు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజం ఏమిటంటే... మీకు కృతజ్ఞతలు తెలపడానికి నాకు మాటలు సరిపోవడం లేదు" అని ట్వీట్ చేశారు.
Chiranjeevi
Tollywood

More Telugu News