Janvi kapoor: మీతో ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను కుదరలేదు: జాన్వీ కపూర్

There were so many things I wanted to say to you but I couldnt Janhvi Kapoor
  • దేవర ఈవెంట్‌ రద్దుపై జాన్వీ కపూర్ వీడియో సందేశం 
  • వేడుక రద్దు కావడం బాధ కలిగించిందన్న జాన్వీ 
  • అభిమానులు జానూ పాప అని పిలవడం ఆనందంగా వుందని వ్యాఖ్య 
'దేవర' ప్రీ రిలీజ్ వేడుక రద్దు కావడం ఎన్టీఆర్‌ అభిమానులతో పాటు హీరో ఎన్టీఆర్‌, హీరోయిన్‌ జాన్వీకపూర్‌లను కూడా వ్యక్తిగతంగా ఎంతో నిరాశకు గురిచేసింది. అభిమానుల తాకిడి ఊహించని విధంగా వుండటం, వేలాది మంది ఫంక్షన్‌ జరిగే ప్రాంతానికి తరలి రావడంతో వేడుకను రద్దు చేశారు. ప్రీ రిలీజ్ వేడుక జరగకపోవడంతో సినిమా టీమ్‌ కూడా డిజప్పాయింట్‌ అయ్యారు. తాజాగా దేవర ఫంక్షన్‌ రద్దు కావడంపై హీరోయిన్‌ జాన్వీ స్పందించారు. అచ్చ తెలుగమ్మాయిలా లంగాఓణితో జాన్వీకపూర్‌ ఈ వీడియోలో కనిపించి తెలుగులో తన సందేశం తెలిపారు. 

'అందరికి నమస్కారం.  ముందుగా నన్ను ఇంతలా స్వాగతించి నా మీద  ఇంత ప్రేమ చూపిస్తున్న తెలుగు ఆడియన్స్‌కు, నన్ను జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్‌ అభిమానులకు నా కృతజ్క్షతలు. నన్ను మీరు సొంత మనిషిలా ఫీలవ్వడం చాలా హ్యపీగా వుంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. నాకు కూడా మీరు అంతే ముఖ్యం. నన్ను ఇంతలా సపోర్ట్‌ చేస్తున్న మీరందరూ గర్వపడేలా ప్రతి రోజు కష్టపడతాను. దేవర నా తొలి అడుగు . దర్శకుడు శివ, ఎన్టీఆర్‌లు నన్నుఈ సినిమాకు హీరోయిన్‌గా సెలక్ట్ చేయడం నా అదృష్టం. నా తొలిప్రయత్నం మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. 

నాకు సహకరించిన దేవర టీమ్‌ అందరికీ నా ధన్యవాదాలు. నేను ఈ మాటలన్నీ కూడా ప్రీరిలీజ్‌ వేడుకలో చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు. త్వరలోనే మిమ్ములను కలుస్తాను' అని జాన్వీకపూర్‌ వీడియోలో సందేశం పంపారు. ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా రూపొందిన దేవర చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Janvi kapoor
Janvi kapoor latest video
Janvi kapoor latest news
Devara news
Devara review

More Telugu News