Snake: ముంబై వెళ్తున్న గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పాము బుసలు.. ప్రయాణికులకు చెమటలు

Snake In A Train Going To Mumbai Here Is Viral Video
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నుంచి ముంబై వెళ్తున్న గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ సర్పరాజం నాట్యం చేసింది. బుసలు కొడుతూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీ 17 కోచ్‌ అప్పర్ బెర్త్ పైన ఐరన్ రాడ్డుకు చుట్టుకున్న పాము ప్రయాణికులపై బుసలుకొట్టింది. పామును చూసిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. మరికొందరు మాత్రం తమ సెల్‌ఫోన్లలో దీనిని బంధించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది పామును పట్టుకుని బయటపడేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Snake
Train
Garib Rath Express
Mumbai
Viral Videos

More Telugu News