Sonu Sood: సీబీఎన్ సార్.. మీ వంద రోజుల పాలన భేష్.. ప్రశంసలు కురిపించిన సోనూ సూద్

Bollywood Actor Sonu Sood Praised Chandrbabu 100 Days Rule
  • చంద్రబాబుది విశిష్ట పాలన అని కొనియాడిన సోనూసూద్
  • ఆయన విధానాలను ప్రజలు విశ్వసిస్తున్నారన్న బాలీవుడ్ నటుడు
  • ఏపీని తీర్చిదిద్దడంలో తనవంతు పాత్ర పోషిస్తానని హామీ
  • త్వరలోనే చంద్రబాబును కలుస్తానన్న సోనూసూద్
సుదీర్ఘ పాలన అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈసారి తనదైన శైలితో దూసుకెళ్తున్నారు. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి నినాదంతో పాలనలో తనదైన ముద్రవేస్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇటీవలే వంద రోజులు పూర్తిచేసుకుంది. 

ఈ నేపథ్యంలో చంద్రబాబు 100 రోజుల పాలనపై బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ ప్రశంసల వర్షం కురిపించారు. తన విశిష్ట పాలనతో తొలి వంద రోజుల్లోనే ప్రజలు సుఖసంతోషాలతో, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని కొనియాడారు. 

పాలనలో ఎంతో అనుభవం ఉన్న సీబీఎన్ సర్ తన విజన్‌తో రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకుంటున్న చర్యలు భేష్ అని ప్రశంసించారు. ఆయన విధానాలను ప్రజలు విశ్వసిస్తున్నారని, చంద్రబాబును చూసి గర్వపడుతున్నానని తెలిపారు. త్వరలోనే ఆయనను కలవాలని కోరుకుంటున్నట్టు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను మరింతగా తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు.

Sonu Sood
Chandrababu
Andhra Pradesh
Bollywood

More Telugu News