Rains: బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు వారం పాటు వర్షాలు

Andhra Pradesh and Telangana Weather Report
  • పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్
  • ఈ నెల 23, 24న తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలలో వర్షాలు
  • వాతావరణ శాఖ తాజా రిపోర్ట్ లో వెల్లడి
బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడిందని, థాయ్ లాండ్ కు ఉత్తరం వైపున మరో సర్క్యులేషన్ ఏర్పడిందని తెలిపింది. ఈ రెండు సర్క్యులేషన్లు అల్పపీడనానికి దారితీస్తాయని అంచనా వేసింది. దీని ఫలితంగా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ నెల 23 (సోమవారం) న ఆంధ్రప్రదేశ్, యానాంలో, 23 నుంచి 25 వరకు తెలంగాణలో, 24, 25న రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపగ్రహ అంచనాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాలు మేఘావృతం అయి ఉంటాయని చెప్పారు. సాయంత్రం 5 గంటల తర్వాత రెండు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించారు. హైదరాబాద్ లో సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
Rains
Telugu States
AP Telangana
IMD
Bay Of Bengal

More Telugu News