Maruti Suzuki: 'ఈవీఎక్స్'‌తో వస్తున్న మారుతి సుజుకి

maruti suzuki to set up 25000 ev charging stations ahead of evx launch
  • త్వరలో ఈవీ మిడ్ సైజ్ ఎస్‌యూవీ ఈవీఎక్స్ కారును ఆవిష్కరించనున్న మారుతి సుజుకి  
  • పెట్రోల్ బంక్ ల వద్ద చార్జింగ్ మౌలిక వసతుల కల్పనకు చమురు సంస్థలతో చర్చలు జరుపుతున్న మారుతి సుజుకి 
  • రూ.20 లక్షల నుండి 25 లక్షల ధరతో అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ మారుతి సుజుకి ఎస్‌యూవీ కారు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి త్వరలో ఎలక్ట్రిక్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ (ఈవీఎక్స్) కారును మార్కెట్ లోకి తీసుకువస్తోంది. ఇందు కోసం దేశ వ్యాప్తంగా సుమారు 25 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటునకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మారుతి సుజుకి సంస్థకు దేశ వ్యాప్తంగా 23వేల నగరాల్లో 5,100 పై చిలుకు సర్వీస్ సెంటర్ల నెట్ వర్క్ ఉండగా, చార్జింగ్ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర చమురు సంస్థలు, ఇంథన సంస్థలతో చర్చలు నిర్వహిస్తోంది. 
 
ఎలక్ట్రిక్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ కార్లకు చార్జింగ్ వసతుల కల్పన ప్రధాన సమస్యగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో తన డీలర్ వర్క్ షాపుల వద్దనే చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసేందుకు గానూ అవకాశాలపై మారుతి సుజుకి కసరత్తు చేస్తోంది. ప్రతి సర్వీస్ సెంటర్ పరిధిలో మారుతి సుజుకి రెండు చార్జింగ్ స్టేషన్లు, బే ఏర్పాటునకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే బెంగళూరులోని మారుతి సుజుకి .. సర్వీస్ మెకానిక్ లకు శిక్షణ అందిస్తోంది. 

పెట్రోల్ బంక్ ల వద్ద ఈవీ చార్జింగ్ కోసం స్థలాలను రిజర్వ్ చేయాలని మారుతి సుజుకి కేంద్ర చమురు సంస్థలను కోరిందని ఆయా వర్గాలు తెలిపాయి. కాగా త్వరలో ఆవిష్కరిస్తున్న ఈవీ మిడ్ సైజ్ ఎస్‌యూవీ ఈవీఎక్స్ కారు ధర రూ.25 లక్షల నుండి 25 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొదటి మూడు నెలల్లోనే మూడు వేల కార్లు విక్రయించాలని మారుతి సుజుకి లక్ష్యంగా నిర్దేశించుకుంది.
Maruti Suzuki
Business News
maruti suzuki evx suv

More Telugu News