Tirumala: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించిన చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్

Chilukuru Rangarajan responds on Laddu Prasadam issue
  • తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్న రంగరాజన్
  • ఇది భయంకరమైన, నమ్మలేని నిజం అని ఆవేదన
  • విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలని విజ్ఞప్తి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ స్పందించారు. లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరగాలన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమలలో ఇలాంటి ఘటనలు చాలా బాధాకరమన్నారు. ఇది భయంకరమైన, నమ్మలేని నిజం అన్నారు.

నిజానిజాలు తేల్చడానికి విచారణను చేపట్టాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినట్లు జాతీయస్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయవచ్చునని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు.
Tirumala
Laddu
Rangarajan
Telangana
Andhra Pradesh

More Telugu News