Viral Videos: సెకన్ల వ్యవధిలోనే ట్యాంకర్‌ను మింగేసిన రోడ్డు... నమ్మశక్యం కానీ వీడియో ఇదిగో!

A water tanker of the Pune municipal body disappeared inside a large hole on Road
  • రోడ్డుపై సడెన్‌గా ఏర్పడ్డ భారీ గుంత
  • అందులోకి వెళ్లిపోయిన వాటర్ ట్యాంకర్
  • పూణేలో వెలుగుచూసిన షాకింగ్ ఘటన
మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ట్యాంకర్‌ అకస్మాత్తుగా ఉన్నచోటే రోడ్డులోకి కూరుకుపోయింది. అనూహ్య రీతిలో పెద్ద గుంత ఏర్పడి ట్యాంకర్ అందులో పడిపోయింది. సెకన్ల వ్యవధిలోనే ఇదంతా జరిగింది. 

పూణే మున్సిపల్‌ కార్పొరేషన్ సంస్థకు చెందిన వాటర్‌ ట్యాంకర్‌‌కు ఈ పరిస్థితి ఎదురైంది. ఇందుకు సంబంధించిన దృశ్యం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. రోడ్డుపై వెళుతున్న ట్యాంకర్ ప్రభావిత ప్రాంతాన్ని దాటుతుండగా వెనుక నుంచి గుంత ఏర్పడింది. వాహనం కూడా వెనుక భాగం వైపు నుంచి లోపలికి దూసుకెళ్లింది. ట్రక్కు వెనుక చక్రాల భాగం మొత్తం గుంతలోకి వెళ్లిపోయింది. 

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. క్యాబిన్ భాగం పైకి ఉండడంతో డ్రైవర్ సురక్షితంగా బయటకు రాగలిగాడు. ఇక సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

మరోవైపు మున్సిపల్ అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. గుంత ఏర్పడడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, రోడ్డు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Viral Videos
Viral News
Maharashtra
Pune

More Telugu News