Chandrababu: తిరుమల లడ్డూ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వండి... టీటీడీ ఈవోను ఆదేశించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu orders TTD EO to give detailed report on Tirumala Laddu issue
  • తిరుమల లడ్డూ తయారీపై వివాదం
  • జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు ఆరోపణ
  • హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ
  • ఈ సాయంత్రం లోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోకు సీఎం స్పష్టీకరణ
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దివ్య ప్రసాదం లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యి స్థానంలో, జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడుతున్నారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలతో రాజకీయంగా అగ్గి రాజుకుంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కల్తీ నెయ్యి ఆరోపణలపై వైసీపీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. 

ఈ క్రమంలో, సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై మంత్రులు, అధికారులతో ఈ మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. ఈ సాయంత్రం లోపు నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 

శ్రీవారి ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని అన్నారు.
Chandrababu
Tirumala Laddu
TTD EO
TDP-JanaSena-BJP Alliance
YSRCP
Andhra Pradesh

More Telugu News