Jr NTR: అట్లీతో సినిమాపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

jr ntr says he will do a film with director atlee in the future
  • అట్లీ ప్రతిభావంతుడైన డైరెక్టర్ అని పేర్కొన్న ఎన్టీఆర్
  • ‘రాజారాణి’ మూవీ తెరకెక్కించిన విధానం ఎంతో నచ్చిందన్న ఎన్టీఆర్
  • భవిష్యత్తులో కచ్చితంగా అట్లీతో మూవీ చేస్తానని స్పష్టం చేసిన ఎన్టీఆర్ 
ప్రస్తుతం దేవర ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న హీరో ఎన్టీఆర్ .. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆట్లీతో భవిష్యత్తులో సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ .. దేవర తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత కోలీవుడ్ స్టార్ దర్శకులతో కూడా మూవీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్టీఆర్ హింట్ కూడా ఇచ్చారు. 

కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అట్లీతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఆట్లీ గొప్ప ప్రతిభావంతుడని, ఆయన నాకు ఓ ఆసక్తికర రొమాంటిక్ కామెడీ స్టోరీ లైన్ చెప్పాడని, దీని గురించి తాము ఇద్దరం చర్చించుకున్నామని, అయితే ఇద్దరం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కారణంగా అది పట్టాలెక్కలేదని ఎన్టీఆర్ అన్నారు.

భవిష్యత్తులో అట్లీతో కచ్చితంగా మూవీ చేస్తానని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఆయన (ఆట్లీ) రాజారాణి మూవీ తెరకెక్కించిన విధానం తనకు ఎంతో నచ్చిందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. దీంతో త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
Jr NTR
Director Atlee
Movie News

More Telugu News