Samineni Udayabhanu: ఈ నెల 22న జనసేనలో చేరుతున్నా: సామినేని ఉదయభాను

Samineni Udaya Bhanu announces he will join Janasena Party on Sep 22
  • వైసీపీకి గుడ్ బై చెప్పిన సామినేని ఉదయభాను
  • నేడు జనసేన కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే
  • వైసీపీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని వెల్లడి
వైసీపీకి గుడ్ బై చెబుతున్న కీలక నేతల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, తాజాగా సామినేని ఉదయభాను... వైసీపీని వీడారు. తాను ఈ నెల 22న (ఆదివారం) జనసేన పార్టీలో చేరుతున్నట్టు సామినేని ఉదయభాను ప్రకటించారు. తనతో పాటు వచ్చే కార్యకర్తలను కూడా జనసేన పార్టీలోకి తీసుకెళతానని పేర్కొన్నారు. సామినేని ఉదయభాను నేడు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

వైసీపీలో తనకు ప్రాధాన్యత తగ్గిందని సామినేని అన్నారు. పార్టీ అధినాయకత్వం తీరు నచ్చకే రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. కాగా, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆదివారం నాడే జనసేనలో చేరనున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. 

Samineni Udayabhanu
Janasena
YSRCP
Andhra Pradesh

More Telugu News