Jani Master: గోవాలో జానీ మాస్టర్ అరెస్టు!

Jani Master Arrested in Goa
  
అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ప్ర‌ముఖ‌ కొరియోగ్రఫర్‌ జానీ మాస్టర్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2) కింద కేసులు నమోదైన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై పోక్సో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌ కోసం గాలింపు ముమ్మరం చేసిన రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసుల బృందం ఎట్టకేలకు ‌ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్ర‌స్తుతం ఆయనను హైదరాబాద్ కు త‌ర‌లిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అనంతరం నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
Jani Master
Bengaluru
Rape Case
Tollywood

More Telugu News