Nara Lokesh: ఈ వినతులను వెంటనే పరిష్కరించండి.. మంత్రులకు సూచించిన లోకేశ్

AP Minster Nara Lokesh Gave Praja Darbar Application To Ministers
  • కొద్దిసేపటి క్రితం భేటీ అయిన ఏపీ మంత్రివర్గం
  • క్యాబినెట్ సమావేశానికి ముందు వినతులు పరిశీలించిన మంత్రి లోకేశ్
  • వాటిని సంబంధిత మంత్రులకు ఇచ్చి పరిష్కారం చూపాలని సూచన
మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి వినతులు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. తన వద్దకు వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరిస్తూ.. వీలైతే అక్కడికక్కడే పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. వాట్సాప్, ట్విట్టర్ ద్వారా అందిన వినతులను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకుసాగుతున్నారు.

తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. నూతన మద్యం పాలసీపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే వలంటీర్ వ్యవస్థ, ఆడబిడ్డ నిధి పథకంపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. పలు ఉద్యోగాల భర్తీకి కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

క్యాబినెట్ సమావేశానికి హాజరు కావడానికి ముందు మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్‌లో తన వద్దకు వచ్చిన వినతులను సంబంధిత మంత్రులకు అందజేశారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అనంతరం క్యాబినెట్ భేటీకి హాజరయ్యారు.
Nara Lokesh
Andhra Pradesh
Praja Darbar
AP Cabinet Meeting

More Telugu News