Sohail: బిగ్ బాస్ ఫేమ్ సొహైల్ ఇంట తీవ్ర విషాదం

Bigg Boss fame Sohail mother passes away
  • సొహైల్ తల్లి కన్నుమూత
  • కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సొహైల్ తల్లి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
సినీ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ సొహైల్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి తుదిశ్వాస విడిచారు. ఆమె గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. 

తన తల్లి మరణంతో సొహైల్ కన్నీరుమున్నీరవుతున్నాడు. సొహైల్ తల్లి భౌతికకాయాన్ని స్వస్థలం కరీంనగర్ కు తరలిస్తున్నారు. సొహైల్ తల్లి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
Sohail
Bigg Boss
Mother

More Telugu News