Viral Video: స్వీటు నోటికి అందిస్తే తినని పెళ్లి కొడుకు.. పెళ్లి వేదికపైనే చెంప ఛెళ్లుమనిపించిన వధువు.. వీడియో ఇదిగో!

Groom Refuses to Eat Sweets from Brides Hand But Ate Slap
  • పెళ్లి తర్వాత వరుడుకి స్వీటు తినిపించబోయిన వధువు
  • రెండుసార్లు తప్పించుకున్న వరుడు
  • మూడోసారి కూడా అదే ప్రయత్నం చేయబోయిన వరుడికి చెంపదెబ్బ
  • నిర్ఘాంతపోయిన ఆహూతులు
పోయింది.. ఇజ్జత్ అంతా పోయింది.. పెళ్లివేదికపై పెళ్లి కుమార్తె చేతిలో పెళ్లి కొడుకు చెంప దెబ్బలు తినాల్సి వచ్చింది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

సంప్రదాయంలో భాగంగా పెళ్లి తర్వాత పెళ్లి కొడుక్కి స్వీటు తినిపించేందుకు పెళ్లి కుమార్తె ప్రయత్నించగా రెండుసార్లు తప్పించుకుని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. మూడోసారి కూడా అదే ప్రయత్నం చేయబోయాడు. అప్పటికే అసహనంతో ఉన్న వధువు మూడోసారి బలవంతంగా అతడి నోట్లో స్వీటు కుక్కి చెంప ఛెళ్లుమనిపించింది. దీంతో వేదికపై ఉన్నవారే కాదు.. ఆహూతులు కూడా ఒక్కసారిగా షాకయ్యారు.  
 
వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల లైకులు వచ్చాయి. ఇది ఎక్కడ జరిగిందన్నది తెలియరానప్పటికీ ఆన్‌లైన్‌లో మాత్రం కామెంట్ల వర్షం కురుస్తోంది. వధువు అంటే ఇలా ఉంటే మజా వస్తుంది అని ఒకరు కామెంట్ చేస్తే.. భగవంతుడా ఇలాంటి అమ్మాయే నా ఫ్రెండ్‌కు భార్యగా వచ్చేలా చూడు అని మరో యూజర్ కామెంట్ చేశాడు. లడ్డు కాకపోతే కనీసం ఇదైనా (చెంపదెబ్బ) తిను అని మరో యూజర్ రాసుకొచ్చాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Viral Video
Marriage
Wedding
Groom
Bride

More Telugu News