Komatireddy Raj Gopal Reddy: వైన్ షాప్ ల వద్ద పర్మిట్ రూమ్ లపై సీఎంతో మాట్లాడతా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

I will speak to Revanth Reddy about wine shops permit rooms says Komatireddy
  • పర్మిట్ రూమ్ లను సాయంత్రం 6 గంటలకు తెరవాలన్న రాజగోపాల్ రెడ్డి
  • మునుగోడు నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని వ్యాఖ్య
  • మద్యానికి బానిసగా మారితే కుటుంబాలు నాశనమవుతాయన్న ఎమ్మెల్యే
మద్యానికి మానిసగా మారితే కుటుంబాలు నాశనమవుతాయని కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. వైన్ షాపుల వద్ద కొనసాగే పర్మిట్ రూమ్ లను సాయంత్రం 6 గంటలకు తెరవాలని చెప్పారు. ఉదయం 10 గంటలకే పర్మిట్ రూమ్ లను తెరిస్తే జనాలు ఉదయం నుంచే తాగడం ప్రారంభిస్తారని అన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి పర్మిట్ రూమ్ లను తెరిచే కార్యక్రమాన్ని మునుగోడు నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాను చర్చిస్తానని చెప్పారు.

స్థానిక మద్యం దుకాణాల నిర్వాహకులే నాలుగైదు గ్రామాల మధ్య ఒక సబ్ దుకాణం ఏర్పాటు చేసి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయిస్తే బాగుంటుందని కోమటిరెడ్డి అన్నారు. దీనివల్ల ఆదాయం పెరగడమే కాకుండా... గొలుసు దుకాణాల నిర్మూలనకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.
Komatireddy Raj Gopal Reddy
Revanth Reddy
Congress
Wine Shops
Permit Rooms

More Telugu News