Sai Dharam Tej: సీఎం రేవంత్ రెడ్డికి రూ.10 లక్షల చెక్కును అందించిన సాయి దుర్గా తేజ్

Sai Dharam Tej met Telangana CM Revanth Reddy and Handed over 10 lakhs cheque
  • వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇచ్చిన హీరో
  • సాయి దుర్గా తేజ్‌కు శాలువా కప్పి సన్మానించిన రేవంత్ రెడ్డి
  • చెక్కులు అందించిన నటుడు విష్వక్సేన్, కమెడియన్ అలీ
ప్రముఖ నటుడు సాయి దుర్గా తేజ్ వరద బాధితుల సహాయార్థం రూ.10 లక్షల చెక్కును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. ఇటీవల భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. దీంతో, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఉభయ తెలుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. ఈ మొత్తాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నారు.

సాయి దుర్గా తేజ్ ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందించారు. సాయి ధరమ్ తేజ్‌కు శాలువా కప్పి ముఖ్యమంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ నటుడు విష్వక్సేన్, కమెడియన్ అలీ తదితరులు కూడా తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ప్రకటించారు. వారు కూడా సీఎంను కలిసి చెక్కులు అందించారు.
Sai Dharam Tej
Floods
Khammam District
Telangana

More Telugu News